![]() |
![]() |

ఒకప్పుడు ఎవరైనా మహిళ తనకి అన్యాయం జరిగిందని, ఫలానా వ్యక్తి నన్ను మోసం చేశాడని అంటే.. మహిళా సంఘాలన్నీ రోడ్డుకెక్కేవి. అయితే ఇప్పుడు ఎక్కడ ఏ మగాడిపై లైంగిక ఆరోపణలు ఇష్యూ తెరపైకి వచ్చినా ఒకే ఒక్కడి గొంతు గట్టిగా వినిపిస్తుంది. అతనే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషా. ఆ మధ్య సంచలనంగా మారిన జానీ మాస్డర్, శ్రష్టి వర్మ వివాదంలోనూ ఆర్జే శేఖర్ బాషా తన గొంతు వినిపించాడు.
బిగ్ బాస్ సీజన్-9 నుండి శ్రష్టి వర్మ మొదటి వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. ఈ క్రమంలో ఆమె రెమ్యూనరేషన్, జానీ మాస్డర్ వివాదం ఇలా రకరాల అంశాల గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం.. శ్రష్టికి సంబంధించిన ఓ ఆడియో కాల్ ని శేఖర్ బాషా లీక్ చేయగా, ఇప్పుడది వైరల్ గా మారింది.
ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శేఖర్ బాషా.. అందులో జానీ మాస్టర్ ది తప్పేం లేదని, అంతా శ్రష్టి వర్మదే అన్నాడు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటు చెప్పాడు. అందులో భాగంగానే శ్రష్టి ఒకరితో ఫోన్ మాట్లాడిన ఓ ఆడియో కాల్ రికార్డింగ్ వినిపించాడు. అందులో తనేం మాట్లాడిందంటే.. నాకు జానీ గారంటే ఇష్టం.. తనతో నాకు మెమోరీస్ ఉన్నాయి.. నాకు గుర్తొచ్చినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్డుకుంటాను అని చెప్పింది.
జానీ మాస్టర్ అంటే ఇష్టమేనంటూనే.. అతడిపై ఇలా ఆరోపణలు చేయడం, ఇలా నలుగురిలో అతని పరువు తీయడం కరెక్టేనా అంటూ శేఖర్ బాషా ఆ ఇంటర్వ్యూలో అన్నాడు. శేఖర్ బాషా ఇంటర్వ్యూలో అన్న మాటలు, శ్రష్టి వర్మ ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రష్టి వర్మ.. అనూహ్యంగా మొదటి వారమే ఎలిమినేట్ అయింది. మరి బిగ్ బాస్ హౌస్ లో శ్రష్టి వర్మ ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |